Wednesday, September 9, 2015

Love story


చుట్టూ మంటలు ....ఒడిలో స్నహేతుడి శవం.. ... పిచ్చిదయిన మరదలు
గుండెలనిండా భారాన్ని మోస్తున్న బాలు కథ ఇది 

******************************************************************************
వరి  నారుమడిలో .......
సూరి  : నాకు తలకి ముందు రెండు కళ్ళు తలకి వెనక రెండు కళ్ళు
మొత్తం నాలుగు కళ్ళు  వుంటే భలే బాగుండేది
బాలు  : ఎందుకురా
సూరి  : వెనక వచ్చే అమ్మాయిలు కనబడడం లేదు రా
బాలు  : అప్పుడు మీ నాన్నకు నలభై చేతులోస్తాయ్ రా
సూరి  : ఎందుకు?
బాలు  : నిన్ను చావగొట్టడానికి , మూస్కొని పని చెయ్
 ( పని ఆపేసి) ఎండగా ఎక్కువగా వుంది నేపోతున్నా చెట్టు కిందకి... వస్తావా ?
సూరి  :  నువ్వు పో.. నేను రాను

/** బాలు, సూరి  చిన్నప్పటి నుండి స్నేహితులు
పక్క పక్క ఇళ్లు , కలిసి ఏడోతరగతి వరకు చదివారు
కలిసే చదువు మానేసారు
ఇద్దరు పొలంలో కూలిపనికి కలిసి వెళ్ళే వాళ్ళు 
బాలు  గాడు కొంచెం తెలివిగల వాడు
సూరి  గాడు అతితెలివి గాడు **/

( పదో తరగతి పరీక్షలు రాసిన సీత వేసవి సెలవులని
అమ్మా నాన్నలకు సాయంగా పనికెల్తుంది
ఎండగా వుండడంతో విశ్రాంతి కోసం రాయుడు గారి చెట్టు కింద చేరింది
బాలు గాడు చెట్టుకిందకు వస్తూనే ... సీతను చూస్తూ గెంతుతూ వచ్చాడు )

బాలు : ఏయ్ ఎలా ఉన్నావే .... నన్ను మర్చిపోయావా..?
సీత : లేదు బావా .. నిన్నెలా మర్చిపోతాను
బాలు : నెల రోజులనుండి ఎందుకు చింతతోపుకు  రావడం లేదు  ?
సీత : పరీక్షలు కదా బావా .. ఇంట్లోనే చదువుకుంటున్నా..ఇంక అయిపోయాయిగా
        సాయంత్రం వస్తాలే
బాలు : నిజంగా ? ఇంక మళ్లీ బడి గిడి అనవుగా ! నాతో ఉంటావుగా ?
సీత :  ఇంక వెళ్ళను

సూరి  : రేయ్ బాలు ఎం చేస్తున్నావ్ అక్కడ ? రా .....ఇంక చాలు
బాలు : వస్తున్నా ......
          (సీతతో ...) సాయంత్రం మర్చిపోకు ... ఎర్ర రంగు వోణి వేసుకురావే
           అదంటే నాకు చాలా ఇష్టం ..
సీత : హ్హ హ్హ అలాగే బావా...

*****************************************************************************************
సాయంత్రం 6 గం|| లు  చింతతోపులో

(బాలు నీలం రంగు లుంగీ కట్టుకుని ...... గట్టుమీద కూర్చొని
వాలి పోయే పొద్దు చూస్తూ మరదలి కోసం ఎదురు చూస్తున్నాడు ..
అంత దూరం నుండే బావను చుసిన సీత మెల్లగా వెనకగా వచ్చి నిలబడింది
పైర గాలికి ఆమె వోణి రెప రెప లాడుతూ బాలు భుజం పైన నుండి మోమును తాకింది
వోణి ఎరుపుకి వాలిపోయే పొద్దు ఇంకొచెం ఎరుపెక్కింది ....)

బాలు : ఇన్నాళ్ళకు గుర్తొచ్చాడా ఈ బావ నీకు ?
సీత  : ( సిగ్గుపడుతూ....) మర్చిపోతేనేగా.... ( పక్కన కూర్చుంటుంది )
బాలు : కళ్ళు మూసుకోవే ఒకసారి
సీత : ఎందుకు బావ ?
బాలు : ఎహె చెప్పింది చెయ్యే ....
సీత : ఆ సరే ( సీత కళ్ళు మూసుకుంటుంది )

( బాలు సీత కాలిని దగ్గరగా తీసుకుని తన ఒడిలో పెట్టుకొని
  సీత కోసం తను పట్నమెల్లి తెచ్చిన పట్టీలు పెట్టాడు ..)
బాలు : ఇప్పుడు తెరువ్
సీత : భలే ఉన్నాయ్ బావ ... నాకోసమేనా ?
బాలు : నేకేనే ...
సీత : డబ్బులెక్కడివి?
బాలు : నెలరోజుల నుండి కూలి డబ్బులు దాచా...
సీత : ఇప్పుడెందుకు నాకు ?
బాలు : నువ్వెప్పటికైనా నా పెళ్లానివేగా అందుకే .
సీత : ( సిగ్గుపడుతూ ) నేనెల్తున్నా ఇంక
బాలు : అప్పుడేనా ...? ఉండవే కొద్దిసేపు ..
సీత : అమ్మ తిడుతుంది ఆలస్యం అయితే ...
        అయినా ఎప్పటికైనా నీ పెళ్లాన్నేగా... ( బాలు అందుకునే లోపే నవ్వుతూ పరిగెత్తింది )

****************************************************************************
( రాత్రి 10 గం|| లు బాలు వాళ్ళ డాబా పైన )

సూరి : రేయ్ పడుకో ఇంక
బాలు : నిద్ర రావడం లేదు
సూరి : నాకు తెలుసు .. ఆ కాంతం గారి అమ్మాయిని చూసావ్ కదా
          కత్తిలా వుంది
బాలు : యదవ ఆపురా ...
సూరి : ఓ రాజ్యం చెల్లెల్ని చూసావా..! అది కొంచెం లావు రా ..
బాలు : అరేయ్ నువ్వు పడుకోక పోతే చంపేస్తా ....
సూరి : హ్హ హ్హ నాకు తెలియదనుకున్నవా ..సీత గురించేగా
          సాయంత్రం చూసా మిమ్మల్ని ..చూడడానికి బాగున్నారు ఇద్దరూ.
బాలు : సీతని చూడాలనిపిస్తుంది రా
సూరి : ఇప్పుడెలా రా ? రేపు చుడోచ్చులే పడుకో
బాలు : ఉహు నాకు చూడాలనుంది . నేనేల్తున్నా
సూరి : పిచ్చోడా తనకి నిన్ను చూడాలని ఉండాలిగా రా ఇప్పుడు
బాలు : అది నా సీత రా .. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వస్తుంది .
సూరి : సరే పద నేను వస్తా ..
( ఇద్దరూ మెట్లు దిగి ఇంటిముందు గేటు తీసుకొని వీధిలోకి తిరుగుతారు )
సూరి : అరేయ్ అటు చూడు
బాలు : ఎటు రా
సూరి : సీత కదూ ..!!
బాలు : ఆ అవును . సీతా ....సీతా ( సీత వైపు పరిగెత్తాడు)..

సీత : బావా .. ( ఏడుస్తుంది )
బాలు : ఏమైంది సీత ?
సీత : బావా ... మరేమో .. ( మళ్లీ ఏడుస్తుంది )
బాలు : ( కన్నీళ్ళు తుడుస్తూ )  చెప్పు సీత .. నీకు నేనున్నా చెప్పు .
సీత : మా నాన్న నన్ను రత్తయ్య మావయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడంట
బాలు : నెకెవరు చెప్పారు .
సీత : అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నా ..
        (ఏడుస్తూ...) బావా నేను నిన్నోదిలి ఉండలేను ..
         నువ్వు లేకుంటే చచ్చిపోతా ...

(సీత తనకోసం అంత ఏడుస్తుంటే సంతోషంతో దగ్గర తీసుకుంటాడు)

బాలు : ఎవరు అడ్డొచ్చినా నిన్ను వదలను .
          ( నుదుటున ముద్దు పెట్టి ) ఇంటికెళ్ళు పొద్దున్నే మీ ఇంటికొస్తా ..
సీత : ఉహు నేను వెళ్ళను .. నీతోనే ఉంటా
బాలు : ( చిరునవ్వు నవ్వి ) పోవే .. నేనెక్కడికి పోను .. నిన్నెవరిని తీసుకుపోనివ్వను
సీత : నేను పోనన్ననా ...( బుంగ మూతి పెట్టి బాలు చేతిని చుట్టేసుకుంది ).

సూరి : బాలు... పోనిలే డాబా పైనేగా ఎవరు చూడరు తీసుకురా .. వేకువ జామునే పంపెద్దువు గాని  ..
బాలు : సరే  ... రా సీత .

( సూరి నిద్రపోయాడు .. బాలు కి నిద్ర పట్టడం లేదు . లేచి సీత వైపు చూసాడు . సీత నిద్రపోతుంది
 చిన్నగా వెళ్లి సీత కాళ్ళ దగ్గర కూర్చున్నాడు . బాలు పెట్టిన పట్టిలు వెన్నెల్లో ఇంక తెల్లగా కనిపిస్తున్నాయ్ ...
నిదానంగా కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని ముద్దాడుతున్నాడు ...
బాలు మీసం తాకడంతో సీతకు మెలుకువ వచ్చింది . కళ్ళు తెరిచి తన బావ చేసే చేష్టల్ని చూస్తూ మురిసిపోతుంది   )

బాలు : సీత .. ! నేనంటే ఎందుకే అంత పిచ్చి ?
సీత : నేను లేచి వున్నానని నీకెలా తెలుసు ...!
బాలు : మనం మాట్లాడుకొక పోయిన మన మనసులు ఒక్కటేనే
సీత : ( బాలు చేతుల్ని పట్టుకుని కళ్ళలోకి చూస్తూ ) బావా మన పెళ్ళికి పెద్ద వాళ్ళు ఒప్పుకోకపోతే ..?
బాలు : నువ్వు పుట్టిందే నాకోసమే .. ఎలా వదులుతాననుకున్నావ్  ?
( బాలు సీత వొడిలో తల పెట్టుకున్నాడు . సీత బాలు తల నిమురుతుండగా )
బాలు : సీతా...
సీత : ఆ చెప్పు బావా ..
బాలు : మీ వాళ్ళు ఒప్పుకోకపోతే , నాతో వస్తావా సీత .!
సీత : ( సీత బాలు చేతిలో చెయ్యివేసి) నేను నీదాన్ని బావ . చావైన బ్రతుకైనా నీతోనే

(బాలు కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి .. అలా అలా ముచ్చట్లాడుకుంటూ నిద్రపోయారు .)
***********************************************************************************************
(ఉదయం 4 గం || లు బాలు సూరి కలిసి  సీతను దిగబెట్టడానికి వెళ్తున్నారు )

సూరి : బాలు , శివాలయం పక్కన ఏదో పొగ కనిపిస్తుంది చూడు .
బాలు : అవును రా ... పద చూద్దాం
( వేగంగా నడుస్తున్నారు .. సీత వాళ్ళను అనుకరిస్తుంది )

బాలు : అది శాస్త్రి గారి ఇల్లు కదా ..అయన ఒక్కడే వుంటాడు ఇంట్లో !
సూరి : అరేయ్ మంటలు రా అక్కడ ... చూడు  చూడు ....
బాలు : అవును కాలిపోతుంది ఇల్లు.. పద పద
( ఇద్దరూ మంటలవైపు పరిగెత్తుతారు .. )
సీత : బావా .... బావా .... ఆగు వెళ్ళకు.  నాకు భయంగా వుంది
బాలు : సీత నువ్వు రాకు అక్కడే వుండు ...
( సీత వినకుండా బాలు వెనకనే పరిగెత్తుతుంది )
సూరి : ఇంట్లో ఎవరో వున్నారు రా .. తలుపు పగుల గొట్టు
( బాలు తలుపు పగులగొడుతుంటాడు.. సీత బావకోసం పరిగెత్తుతుంది ...)
సూరి : సీత రావొద్దు ఇక్కడికి అక్కడే వుండు .
సీత : బావా ...బావా
సూరి : సీత రావొద్దు . వెల్లిపో
( బాలు ఇంటిలోపలికి వెళ్తాడు శాస్త్రి గారిని కాపాడడానికి ,, సీత వేగంగా మంటల వైపు వస్తుంది
సూరి సీతను వారించడానికి ఎదురు వెళ్తాడు
సీత సూరిని పక్కకు తోసి ఇంటిలోపలికి వెళ్తుంది .. ఈ లోగా బాలు ఇంకో ద్వారం నుండి శాస్త్రి గారిని బయటకు తెస్తాడు ).
బాలు : సూరి ..! సూరి .. ! ఎక్కడ రా  సీతా ... సీతా ..! ఎక్కడున్నారు మీరు.....
( సీత నెట్టినప్పుడు సూరి మంటల్లో ఇరుక్కుంటాడు . సగం కాలిన గాయాలతో  )
సూరి : బా.... లూ....... ( అని చెయ్యి చూపిస్తాడు )
బాలు : (ఏడుస్తూ .) సూరి ... రేయ్ సూరి .... (ఏడుస్తుంటాడు ..)
సూరి : రేయ్ బాలు నన్ను మర్చిపోతవా రా ...
బాలు : రేయ్ అలా అనకురా .. ( పైకి లేపడాని ప్రయత్నిస్తాడు సూరిని కాపాడడానికి ..)
సూరి : రే.... య్.....
 ( సూరి ప్రాణం పోతుంది ...... బాలు పెద్దగా ఏడుస్తుంటాడు .... చిన్నప్పటి నుండి కలిసి తిరిగిన మిత్రుడు అలా తన చేతిలోనే ప్రాణం వదిలేసేసరికి భోరున ఏడుస్తాడు ... )

బాలు : (ఒక్కసారిగా ఏడుపు ఆపి ఆలోచిస్తూ ..) సీత .... సీత 
( కాలిపోతున్న ఇంటి వైపు చూస్తాడు ... ఇల్లు 90% కాలిపోయింది
బాలు మనసు పగిలిపోయింది.. సీత ఏమైందో తెలియక వచ్చే ఏడుపు ఆపలేక
గుండె బరువయ్యింది ..... సూరి దేహాన్ని అరుగు మీద పెట్టి .. ఇంటిలోకి వెళ్తాడు
ఇల్లంతా కాలిపోయింది. ఏమూల వెతికినా సీత కనిపించడం లేదు ..
బాలు : సీతా... సీతా..... ఎక్కడున్నావ్ ....సీతా ....(పెద్దగా అరుస్తున్నాడు )

సీత : బావా ( నవ్వుతూ పరిగెత్తుకొస్తుంది .. ) ఎక్కడికెల్లావ్ ? నన్నిక్కడ వదిలేసి ..?
( బాలు సీతను తీసుకొని బయటకు వస్తాడు )
బాలు: సీత  నువ్వింటికెళ్ళు..
సీత : ( గాల్లోకి చూస్తూ ) ఎవరింటికి బావ ..?
బాలు : మీ ఇంటికి ..
సీత : మా ఇల్లేంటి ? మన ఇంటికి పోదాం రా బావా ..
బాలు : సీతా ... ఈ సమయం లో వేళాకోలం కాదు ఇంటికెల్లు
సీత : ఎవరింటికి బావా ...? ( కింద కూర్చొని ఏడుస్తుంది )
( బాలు అనుమానంగా సీత వైపు చుస్తూ ..)
బాలు : మీ నాన్న పేరేంటి ?
సీత : ఆయనెవరు ?
బాలు : మీ అమ్మ పేరు ?
సీత : ( ఏడుస్తూ వెర్రి చూపులు చూస్తుంది ...)
బాలు : సీతా .... ఆ ....( సీతను గుండెలకు హత్తుకుని ఏడుస్తాడు.......
          సీత ఆ ఇంట్లో కెళ్ళినప్పుడునప్పుడు భయంతో పిచ్చిదైపోయింది ..)
***************************************************************************************************************
సమయం 5 గం||లు వూళ్ళో ఇంకా అందరు నిద్ర కుడా లేవలేదు ,
కాని మూడు జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి ..
సీతకు తన బావ తప్ప ఎవరు గుర్తులేరు ...అంతగా ప్రేమించిన సీతకు
ఇప్పుడు అమ్మ, నాన్న అన్ని బాలునే ..
స్నేహితుడిని గుర్తుగా ఒక పిల్లాడిని దత్తత సూరి అని పేరుపెట్టాడు ..

నిస్వార్ధ ప్రేమకు సీత సాక్ష్యం
ప్రాణస్నేహానికి సూరి సాక్ష్యం
ఇంకా మానవత్వం బ్రతికి  ఉందనడానికి  బాలు సాక్ష్యం

@Lakshmi

Tuesday, September 8, 2015

1000 ఎకరాల ఆసామి అయినా 100 రూపాయల కూలివాడయినా పోయేది ఆ కాటికే....



చెప్తే విడ్డూరం అంటారు గానీ
అనుభవించే వాడికి తెలుస్తుంది బాధేంటో
ఈ మధ్య రిజర్వేషన్లు ఉండకూడదు అని తెగ చించుకుంటున్నారు
మా వూరు రండి చూపిస్తా ,ఉంచాలో తెంచాలొ అప్పుడు తెలుస్తుంది.
మా ఇంటిముందు మేము కుర్చీలో కూర్చుంటే
ఆ రోడ్డున పోయే పెద్దాయన కోసం లేచి నిలబడి సలాం కొట్టాలి ,
లేకుంటే రేపొద్దున
పొలానికి నీళ్ళు రానివ్వరు
పెట్టుబడికి వూళ్ళో అప్పు పుట్టనివ్వరు.
గుళ్ళో పూజారి ప్రసాదం పెట్టడు
మేము వెళ్తే గుళ్ళో దేవుడు మాయం అవుతాడనేమో
పదిమందిలో భోజనం తిననివ్వరు.
మేము వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ కడుపు నిండదేమో
ఎర్రటి ఎండలో రోజంతా పని చేస్తే కూలిడబ్బులు
ఇవ్వడానికి ఏడ్చి చస్తారు .
మా పిల్లలు బడి కెళ్తే ఆళ్ళు ఫీజు కట్టినట్టు భోరున ఏడుస్తారు
వాళ్ళకు పాలేర్లు కరువవుతారని,
మా ఆడపిల్లలు రోడ్డున పోతుంటే వెంటపడి వేధిస్తారు
వాళ్ళకు ఆడపిల్లలు లేనట్టు
మేమొప్పుకుంటాం తక్కువ కులం వాళ్ళని
కాని ఎప్పటికి ఒప్పుకోం గుణం తక్కువ వాళ్ళమని .
ఒకడికి తినటానికి వుండదు,
నాది పెద్ద కులం అని బట్టలు చించుకుంటాడు
ఇంకొకడికి కట్టుకున్న పెళ్ళామే మాట వినదు ,
సెంటర్లో కూర్చొని కుల పెద్దనని అని విరుచుకుంటాడు.
నువ్వు పెద్దకులమని తినకుండా వుంటే కులం కడుపునింపదు
కులం పచ్చబొట్టు వేయించుకున్నంత మాత్రాన వచ్చే చావు ఆగదు
ఎవడు చచ్చిన పూడ్చేది ఆరడుగుల గోయ్యిలోనే
నీ కులపోల్లే నువ్వు కంపుకొడుతున్నావని
ఊరిచివర విసిరి పారేస్తారు
నీ కులపోల్లే నువ్వు కుళ్ళి పోతున్నవని తగులబెడతారు
1000 ఎకరాల ఆసామి అయినా
100 రూపాయల కూలివాడయినా పోయేది ఆ కాటికే.....
@Lakshmi