గుంటూరు బావ



1. గుంటూరు బావ 
 --------------------
కోడికూర చేసుకుందామని
బావని కోత్తిమీరకోసం పంపా
నిన్న సందేళ పోయిన బావ
ఈరోజు పొద్దునకు వచ్చాడు
.
యాడికి పోయినవ్ బావా అంటే
మన ఆంధ్ర మన అమరావతి
మన కొత్తిమీర అంటూ
గుంటూరు పోయి కొత్తిమీర తెచ్చా అన్నాడు .
చీపురు కోసం వెతుకుతున్నా
అది దొరకాలా ........

--------------------------------------------

2. గుంటూరు బావ 
  --------------------

పెంచుకోడానికి కుక్కపిల్లని
తీసుకురా బావా అంటే
కోడిపిల్లను పట్టుకొచ్చాడు
తెచ్చినోడు గంపకింద పెట్టాడా..!
లేదే మేకపిల్లను కట్టేసినట్టు
గుంజకు కట్టేశాడు.
వచ్చి కోడిపిల్ల ఏది బావా అంటే
పిల్లి పిల్ల తింది పెళ్ళామా అన్నాడు
చూస్తూ ఏం చేస్తున్నావ్ అంటే
మన పిల్లి పిల్లేగా అన్నాడు
బావ రాక్స్ నేను షాక్స్
--------------------------------------------

3. గుంటూరు బావ 
  --------------------

మా బావ తప్పిపోయాడు
గంట నుండి కనిపించడం లా
స్నానానికని పోయాడు పిచ్చి బావ
మళ్లీ కనిపించలా వెతకడం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని బయలు దేరా
దారిలో గుర్తొచ్చింది మా ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు
వెంటనే రైల్వే స్టేషన్ కి బయల్దేరా పట్నానికి పోదామని
అరెరె మా వూర్లో రైల్వే స్టేషన్ కూడా లేదు
వెంటనే బస్టాండ్ కోసం వెనక్కోచ్చా
అప్పుడే తెలిసింది ఆకరి బస్సు పోయిందని
నడిచి పోదామని తోడుకోసం ఇంటికి బయలుదేరా
దార్లో గుర్తొచ్చింది బావను బాత్రూం పెట్టి గొళ్ళెం పెట్టా అని
.
సారీ బావా
.
వస్తున్నా వస్తున్నా
ఏడవకు

--------------------------------------------

4. గుంటూరు బావ 
   --------------------

పోయాడు
మా బావ మళ్లీ కనపడకుండా పోయాడు
ఈసారి నేను ఎక్కడా పెట్టి తాళం వెయ్యలేదు
ఏ కొత్తిమీర కోసం పంపలేదు
ఎటుపోయాడో తెలియడం లేదు
గుంటూరు పోయాడో బెజవాడ వెళ్ళాడో
ఎలా తెలిసేది
దిష్టి తగులుతుందని ఫోటో కుడా తీయించలేదు
పెళ్లినాడు సిగ్గు ఎక్కువై ఒక్క ఫోటో కి కూడా
మా బావ మొహం చూపించలేదు.
ఇట్టా అవుతుందని తెలిస్తే
వంట ఒక్కదానికే చేసుకునే దాన్ని
ఏం చేస్తా మిగిలింది మధ్యరాత్రి మెలకువ వస్తే తింటా
 
--------------------------------------------------------


5. గుంటూరు బావ 
   --------------------

మళ్లీ అంతే
మళ్లీ మళ్లీ అంతే
ఎన్ని సార్లు చెప్పినా మా బావ మారడు
ఇంట్లోకి  బియ్యం తీసుకురమ్మంటే
ఊరవతల మాగాణికి నీళ్ళు పెడుతున్నాడు
ఏం చేస్తున్నావ్ అంటే
మేజర్ చంద్రకాంత్ సినిమా లో
NTR డైలాగులు చెబుతున్నాడు
నారు పోసి నీరు పెట్టి
పొలం పండించి బియ్యం తెస్తాడంట
.
నేను మా పుట్టింటికి పోతున్నా ..

--------------------------------------------------------


5. గుంటూరు బావ 
   --------------------
 
అలిగి పోయినా సరే
మనసుండబట్టక
ఇయ్యాల పొద్దునే దిగబడ్డా
నేను లేక ఏడుస్తూ
కుర్చుంటాడనుకున్నా..
కాని
సిల్కు చొక్కా ఏసుకుని
కోటప్పకొండ తిరనాలకు పొయ్యాడు
సచ్చినోడు
ఈరోజు ఆ చొక్కా అన్నా చినగాల
లేక నా చెయ్యన్నా విరగాల ...


 
--------------------------------------------------------
 
6. గుంటూరు బావ 
   --------------------

బావోయ్
ఓ బావోయ్
ఏడ జచ్చాడో మా బావ
ఆదివారం సంతకు పంపితే
సరుకులతో పాటు
సరుకులమ్మిన అమ్మిని కుడా తెచ్చాడు
తెచ్చినోడు అది నాకేమవుతుందో
ఇవరం చెప్పకుండా పోయాడు
అది నా నెత్తిన ఆడతంది
పొమ్మంటే ఉరిమి సూత్తంది
రమ్మంటే కసిరి కొడుతుంది
అరేయ్ బావా
ఎక్కడ చచ్చావురా ... 

 ------------------------------------------------------

7. గుంటూరు బావ
-----------------------------
వచ్చాడు వచ్చాడు
అనుకున్నంత సేపు పట్టలేదు
మా బావ రావడం , మళ్లీ పోవడం
పట్టుచీర తెస్తా అంటే
పాతికరూపయిలిచ్చి పంపా ......
పండక్కి పట్టుకొస్తా అని పోయినోడు
పక్క ఊరి పారిజాతం తో కలిసి
జాతరలో పూతరేకులు కొంటూ
కనిపించాడు
పావలా మొహమోడు .. 
.
@Lakshmi


1 comment: