Monday, November 9, 2015

A Women's Suicide Note


మధ్యాహ్నం నుండి ఆకాశానికి ఆవేదన ఎక్కువై ఏడుపు రూపంలో భూమాతకు
ఏకరువు పెడుతుంది
వసారాలో కూర్చొని ఇంటిలోకి చూస్తున్నా ...
చీకటి పడడం వల్ల తన టైం నడుస్తుందని చిన్న దీపం చీకట్లో ఆడుతుంది.
గాలికి పైన కప్పు కొంచెం చెదిరి వాన నీళ్ళు అక్కడక్కడ ఇంట్లో పడుతున్నాయి
ఇదంతా తెలియని నా రెండు నెలల పాప ఊయలలో నిద్ర పోతుంది.
నిన్నటి రోజు రేపటికి పాఠం అనుకుని దానికి ప్రాణం పొసా
కాని
నా గతం నా పాప రేపటి వాకిలిని మూసేయ్యకూడదు.
గానుగకు కట్టిన ఎద్దుకైన కునుకు పాటుకు కరునిస్తారేమో గాని
ఆడదాని జన్మకు ఆ కనికరం దక్కదు.
నన్ను చూసి నా పాప భవిష్యత్తు చీకటి కాకూడదు
.
నా ఆఖరి ఉదయం నేను చూసేసాను .
నా బిడ్డ మొఖం తనివి తీరా చూసేసాను
నా చివరి కన్నీటి బొట్టు నేలకు జారింది.
.
వేళ్ళు వెంట తెచ్చుకున్న విషాన్ని సున్నితంగా తాకాయి.
చెమర్చిన కళ్ళు ఇంకా ఎదురుచూడలేక పోతున్నాయి
మారు మూల బ్రతుకు పూరిపాక లోనే పురుగు పట్టి పోబోతోంది .
కనీసం నా బిడ్డకు బిడ్డగా పుట్టినప్పుడైనా రాత మారిపోతే చాలు.
ఈ క్షణమే నాది మరు క్షణం కావాలనుకున్నా పొందలేను.
వారం నుండి వాయిదా వేస్తున్నాఈరోజుని .
చేతి వేళ్ళు సీసాను నోటి దగ్గరకు మోసుకోస్తున్నాయి.
ఇంకెంత దూరం , కేవలం బ్రతుక్కి చావుకి ఉన్నంత దూరం
సీసా పైకెత్తి నోట్లో పోసుకోబోయా
హోరు గాలికి దీపం ప్రాణం పోయింది
నా బిడ్డ ఏడుపుకి నా చేతిలోని సీసా వాన పాలయ్యింది
కళ్ళలోంచి నీళ్ళు కాలువలు గట్టాయి.
జీవితం నాపై కనికరించలేదని
నా బిడ్డను నేను అనాధను చెయ్యబోయాను.
అక్కున చేర్చుకుని ఆదరించాల్సిన నేనే
పొత్తిళ్ళలో పసికందుని పాలకోసం ఏడిపించ బోయాను
నాకెవరు లేక పోవచ్చు .... నా బిడ్డకు నేనున్నాను
నా బిడ్డ కోసం నేనుంటాను
బ్రతికుంటాను

ఇట్లు
Lakshmi

No comments:

Post a Comment