Thursday, February 18, 2016

అకారణ జన్ములు


పుట్టక ముందే వీళ్ళ తలరాతలు
వీళ్ళ నాలుకలమీద పొరపాటుగా
రాయబడ్డాయి
మారుద్దామని ప్రయత్నిస్తుంటే
పళ్ళు కొరుకుతున్నారు
వాళ్ళ నాలుకలు వాళ్ళ పళ్ళ మధ్యనే
ఇరుక్కుని నలిగిపోతుంటే
ఎవరో ఏదో చేసారని కళ్ళెర్ర చేస్తున్నారు
కారణ జన్ములారా
మీరు కారణం లేకుండానే పుట్టినట్టున్నారు
అందువలననే మీ రాత మీ చేతితోనే
రాసుకోవాలనుకుంటున్నారు
.....
అడవిలోనుండి ఏరుకోచ్చిన
ఎండుపుల్లలతో ఎంత రాసినా
పుల్ల విరుగుతుందే గాని
మీ రాతలు మారవు
మీరు కోరుకున్న మార్పు
జరగడంలేదని మమ్మల్ని నిందించకుండా
ఎండిపోయిన పుల్లలను వదిలేసి
చిగురుటాకులను చూడండి ..
మీ పళ్ళ మధ్య పడి నిలువుగా తెగిన నాలుక
నవ్వడం మొదలు పెడుతుందేమో ....

@Lakshmi

No comments:

Post a Comment