Friday, February 5, 2016

నలుపు

ఆ పేరు చెప్పుకుని బ్రతికే కంటే
ప్రోస్టిట్యూషన్ బెటర్
చీరలిప్పే బ్రతుకుకంటే
చీర విప్పాల్సి వచ్చే బ్రతుకే కొంచెం బెటర్
.
మనః సాక్షి లేని మనుషులారా
మీరు మీలోనే చంప బడ్డారు
మీరు బ్రతికున్న శవాలు
మీ మనసుల కుళ్ళిన కంపు
మా ఇంటి ముందు ఆరేసిన
తెల్లని బట్టలకు మసి లాగా అంటుకుంది
.
వాటిని రోజు ఉతికి వాడుకోవాల్సి వస్తుంది
ఎక్కడ ఆ మసి నా ఒంటికి అంటుకుంటుందో అని
.

మీ నల్లటి బొగ్గు దేహాలకు సున్నమేసినా
దానితో రాయడం మొదలు పెట్టగానే
మీ సిగ్గుమాలిన బ్రతుకే బయటకొస్తుంది
.
నాకేందులే అని పక్కకు పోయినా
మీ నీడలు నన్ను చూసి
నేను మీ ముందు ఓడానని నవ్వుతున్నాయి
రోషంతో వెనక్కొస్తే
నా జీవితాన్ని నాకేయ్యాలని
మీరు పెంచిన
ఆ వంకర తోకల పిచ్చి కుక్కలు
నాలుకలు బయట పెట్టి సొంగ కారుస్తున్నాయి
.
నేను నేర్చుకున్న భాష
మనుషులకు అర్ధం అవుతుంది
అందుకే రెండు కాళ్ళమీద నిలబడలేని
కుక్కలతో మాట్లాడలేక
నా మనసుని మసిబారకుండా
కాపాడుకోవాలని వెళ్ళిపోతున్నా 
@Lakshmi

No comments:

Post a Comment