Thursday, August 13, 2015

*** నా మొదటి కధానిక కుల వ్యవస్థకోసం ****



*** నా మొదటి కధానిక కుల వ్యవస్థకోసం ****

ఎంత వెతికినా కనుచూపు మేర ఏ ఒక్కరు కనిపించడం లేదు ఊళ్ళో
మా ఇంటి కి వెళ్ళాలంటే ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలి
ఏదో ఒక చివరన విసిరేసినట్టుంటుంది మా ఇల్లు
కులాల గొడవలతో విసుగొచ్చి
అయినవాళ్ళ ఆరళ్ళుతో అలుపొచ్చి
ఊరిచివర గూటిలో అడుగుపెట్టి ఏడేళ్ళు అవుతుంది

ఎప్పుడు రైలు కి వెళ్ళే నేను ఈసారి బస్సు కి వచ్చా
హైదరాబాద్ నుండి
నా జీతం పెరిగిందని అమ్మ కోసం చీర తీసుకున్నా..
మా ఊరు టౌన్ నుండి 15 కిలో మీటర్లు
నాన్న ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఒక్కదాన్నే టౌన్ నుండి వస్తున్నా..

సమయం 4.30 AM కొంచెం బెరుకుగానే వుంది
అయినా మా ఊరే కదా నాకెందుకు భయం

అప్పుడే ఆగినట్టుంది వాన
చల్లటి గాలి ఒంటిని తాకగానే
ఉన్నపళంగా పైట చెంగు కప్పెసా

కొంచెం దూరం లో వీధి దీపాల వెలుగులో
ఏదో కనిపిస్తుంది ఎర్రగా

నడి రేయి సింధూరాన్ని దిద్దు కుందా
అనిపించింది ఆ రంగు చూస్తుంటే
జామురాతిరి జోలపాట లా వినిపిస్తుంది
ఏదో సన్నని మూలుగు ఓ మూలన

తేరిపార చూస్తూ అడుగు ముందుకేసా
మూలుగు వినపడటం ఆగిపోయింది

ఇంకో పది అడుగులేస్తే మునుసుబు ఇల్లు
చూస్తుంటే ఇల్లు తాళం వేసినట్టు కనబడుతుంది
ఊరేల్లారనుకుంటా

పక్కనే పెద్దాయన ఇల్లు
నేను పని చేసింది వాళ్ళింటిలోనే
వయసైపోయుంటుంది అయినా నన్ను చుస్తే గుర్తుపడతాడు
ఆయనకిద్దరు కొడుకులు

తెలియని వయసులో చిన్నోడు నాపై
మనసుపడ్డాడు
కులాలు వేరని ఆ పెద్దాయన అడ్డుపడ్డాడు
ఆడికి పెళ్లయ్యిందని మొన్ననే తెలిసింది

మనసుని లాక్కొని అడుగు ముందుకేసా
ఇంత పెద్ద గోపురం
అక్కడనుండి 10 నిమిషాలు మా ఇంటికి

ఇందాక వినిపించిన మూలుగే మళ్లీ వినిపిస్తుంది
ఈసారి ముందుకడుగేస్తుంటే మూలుగు
మరింత పెద్దగ వినిపిస్తుంది

దూరం నుంచి చిన్న వెలుగు
నాకు తెలుసు ఆ వెలుగు మా ఇంటిదే
మా నాన్న 4 గం కే లేస్తాడు

మూలుగు మాత్రం నన్ను వదలడం లేదు
నేను నడిచే కొద్దీ నాతో వస్తున్నట్టు అనిపిస్తుంది

మనసెందుకో కీడు శంకిస్తుంది
ఆగలేక ఇంటికి ఫోను కలిపా
బీప్ బీప్ ..... అని ఆగిపోయింది

ధైర్యం చేసి మూలుగు ఎక్కడ వినపడుతుందా
అని అడుగేసా
రెండడుగుల దూరం లో కాలువ పక్కన ఏదో కదులుతుంది

కళ్ళు పెద్దవి చేసి చూసా మనిషి
మా ఇంటి పక్క సూరి వాళ్ళ అవ్వ
పరుగేత్తుకెల్లా
ఊపిరుంది కాని మన సోయలేదు
సూరి వాళ్ళ ఇంటి దగ్గరకు పరిగెత్తా
ఇంటి ముందు గిత్తలు రక్తపు మడుగులో వున్నాయి

ఏదో జరిగింది
వీళ్ళంతా ఏమయ్యారు
తెలియకుండా కళ్ళలోంచి నీల్లోచ్చాయి
తుడుచుకుంటూ మా ఇంటి వైపు చూసా
గుండె వేగంగా కొట్టుకుంటుంది

ఒక్కసారిగా పెద్ద అరుపు పేగులు తెగేల అరిచారు
నిమిషం గుండె ఆగింది
ఆ అరుపు మా గుడిసె వైపు నుండి వచ్చింది
నా వాళ్ళు కాదు, నా వాళ్ళు కాకూడదు అనుకుంటూ
నడిచా ...

ఎవరో ఆరడుల వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు
చీకట్లో అర్ధం కావడం లేదు
నా వైపే వస్తున్నాడు
గుండె చిక్కబట్టుకుని వున్న

కొంచెం దూరంలో ఉండగానే గుర్తుపట్టా
మా నాన్న
మా నాన్నని పట్టుకొని పెద్దగా ఏడ్చా.

వెంటనే ప్రశ్న
ఎందుకొచ్చావ్ ?
ఇంటికెల్లు అమ్మ తమ్ముడు జాగ్రత్త
మళ్లీ చెప్తున్నా అమ్మ తమ్ముడు జాగ్రత్త ...
మా నాన్న గోపురం వైపు పరిగెత్తాడు

నేను వెంటనే ఇంటికి పరిగెత్తా

నా కళ్ళు వీలైనంత పెద్దగా అయ్యాయి
మా గుడిసె ముందు నలుగుర్ని పడుకోబెట్టారు
నలుగురు ఒకే కుటుంబం
రక్తపుమడుగులో వున్నారు
చుట్టూ జనం వున్నారు
ప్రతి ఒక్కరి ఒంటి పైన గాయాలు

నాకు ఏం అర్ధం కావడం లేదు
అమ్మని వెతికా ఆ గుంపులో
అమ్మ తమ్ముడు గుడిసె ముందు కూర్చున్నారు

మా అమ్మ నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది
తమ్ముడు అమ్మ వెనకాలే వచ్చాడు
ఇద్దరు నన్ను పట్టుకొని ఏడ్చారు

ఏడుస్తూ మా అమ్మ నాకేదో చెప్తుంది
బా ... బా ... బాబాయ్
హా బాబాయ్ ఏమైందమ్మా అనడిగా భయంతో
సత్రం దగ్గర కట్టేసారమ్మ అని మళ్లీ భోరున ఏడ్చింది

అప్పుడు అర్ధం అయ్యింది నాన్న ఎందుకు పరిగేత్తాడో
అమ్మకి తమ్ముడుకి జాగ్రత్త చెప్పి సత్రం వైపు పరిగెత్తా..

మా ఊరు కులాల మూలాలు బాగా పాతుకుపోయిన పల్లెటూరు
అగ్రకులాల అరాచకాలు తట్టుకోలేక చాలా సార్లు తిరగబడ్డ
మా నాన్న నన్ను సముదాయించే వాడు
మా కుటుంబం లో నాన్నకి బాబాయ్ కి నాకు కోపం ఎక్కువ

ముందు రోజు సాయంత్రం
వాళ్ళ అమ్మాయి మా కులం వాడితో వెళ్ళిపోయింది
ఇద్దరినీ పట్టుకొచ్చి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగులబెట్టారు
దారిలో సూరి చెప్పిన విషయం ఇది

అంతటితో ఆగకుండా ఆ అబ్బాయి కుటుంబాన్ని నరికి చంపారు
వాళ్ళే మా గుడిసె ముందు పడుకో బెట్టిన కుటుంబం

మా బాబాయ్ ని ఎందుకు కొడుతున్నారని అడిగా
ఆ జంట ముందురోజు మా బాబాయ్ ని సాయం అడిగారు
ఆయన హైదరాబాద్ టికెట్స్ తెచ్చి ఇచ్చాడు వాళ్లకి

ఇంతలో ఇంకో అరుపు వినబడింది
అది సత్రం వైపు నుండే
ఈసారి నేను భయపడలేదు కోపం పెరిగింది
అక్కడ నా వాళ్ళు వున్నారని కాదు
నా కులం వాళ్ళు వున్నారని కాదు
మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించలేని సమాజాన్ని చూసి

నాలుగడుగుల్లో సత్రాన్ని చేరా
బాబాయ్ రక్తం కారుతున్నా రొమ్ము విరుచుకునే వున్నాడు
నాన్న తన శక్తి ఉన్నంతవరకు పోరాడుతున్నాడు
సూరి, నేను కూడా వాళ్ళను వారించడానికి వెళ్ళాం
ఒకడు వెదురు కర్రతో నా తలపై కొట్టాడు
ఒక్క ఉదుటున వెనక్కి పడ్డా

చేతికి ఏదో తగులుతుంది గట్టిగా
గట్టిగా పట్టుకొని అదేంటో కూడా చూడకుండా కొట్టేసా
వాడు ఉన్నపళంగా కింద పడ్డాడు నిమిషంలో ఊపిరాగిపోయింది

నాచేతికి దొరికింది కర్ర కాదు గునపం
పక్కకి చూసా సూరి నా వైపు చూసి చిరు నవ్వు నవ్వాడు
అయిదు నిమిషాల్లో అందరం మా గుడిసె ముందు చేరాం

ఇప్పుడు పూర్తిగా అర్ధం అయ్యింది నాకు
నేను ఉండాల్సింది ఇంకా ఊళ్లోనే అని ......

@Lakshmi

2 comments:

  1. Very Nice Lakshmi..! Fantastic perfect poetic narration..! you really have bright future in writing..! i liked it like anything
    And out of curiosity is that real story ? i can match few incidents are probably real life ones hope if i am not wrong..! but on whole it is very very good

    ReplyDelete