Thursday, August 20, 2015

** బాపు గారి బొమ్మ **



నాకో అలవాటుంది
పుట్టడానికి అమ్మాయిల పుట్టానే కాని
వేషాలన్ని అబ్బాయివే
అంటారు అందరు ...
ఒక్కోసారి నాకు అలానే అనిపిస్తుంది


నాకు బాపు గారి సినిమాలలో
అమ్మాయిలంటే చాలా ఇష్టం

ఆగస్టు నెల తేది గుర్తులేదు
ఉద్యోగం కోసం ఈ కంపనీ కి వచ్చాను
సచ్చినోళ్ళు
ఇంత చిన్న ఉద్యోగానికి ఇప్పటికి రెండుసార్లు పిలిచారు
దీంతో మూడోసారి రావడం
ఈరోజన్నా తెవుల్చుతారో లేదో మరి

ఆలోచనల్లో వున్నా
ఒకామె వచ్చి లోపలికి రా అంది

వెనక నుంచి చూస్తుంటే
నడుము గడియారం లోలకం లా
తిప్పుతుంది
ఒక చిన్న గది లోకి తీసుకెళ్ళింది
చాలా చిన్నది

చూస్తుంటే పెళ్లయినట్టుంది
మెట్టల కోసం కాళ్ళ వైపు చూసా
చుసేలోపు వెళ్లి కూర్చుంది
ఇద్దరం కూర్చున్నాం

నవ్వుతుంటే
రాజేంద్రప్రసాద్ పెళ్ళిపుస్తకం హీరోయిన్ లా వుంది

ఆమె నన్ను ఏదో ప్రశ్నలు వేస్తుంది
నేను అనాలోచితంగా ఏదో జవాబులిస్తున్న

నా ఆలోచనలన్నీ ఆమెని వర్ణిస్తూ వెళుతున్నాయి
సగం రింగులు తిరిగిన జుట్టు
ఆమె మెడను కప్పేసే సరికి
మేడలో తాళి వుందో లేదో కనిపించడం లేదు
చిన్న బొట్టు పెట్టింది
కళ్ళజోడు వుంది కాని
కళ్ళకు పెట్టిన కాటుక నిక్కచ్చిగా కనపడుతుంది
పెదవులు
ముదురు గులాబిరంగులో వున్నాయి
ట్యూబ్ లైట్ వెలుగులో ఇంకొంచెం మెరుస్తున్నయ్

ఆడ వాళ్ళ చేతి వేళ్ళను బెండకయలతో
ఎందుకు పోల్చుతారో అర్ధమయ్యింది నాకు
ఆమె వేళ్ళను చుస్తే

ఇంతలో ఒక అతను వచ్చాడు
ఆమె నన్ను ఇంటర్వ్యూ చెయ్యడం
అయ్యిందని చెప్పింది అతనితో

నడుచుకుంటూ బయటకు వెళ్ళింది
నాకు ఉద్యోగం వచ్చింది

పోయి పోయి నన్ను ఆమె టీం లోనే వేశారు
నా కళ్ళు ఊరుకుంటాయా
వస్తున్నా పోతున్నా కూర్చున్న నిల్చున్నా
ఆమె ఏం చేస్తున్నా ఆమెనే చూస్తున్నా

వర్ణిస్తూ పోతే ఆడవాళ్ళలో ఎన్ని వర్ణాలో

అందుకే బాపుగారి అమ్మాయి బొమ్మలు
అంత వయ్యారంగా వుంటాయి
@Lakshmi

No comments:

Post a Comment