Wednesday, August 19, 2015

*** చౌదరి గారి అబ్బాయి ***

చౌదరి గారి అబ్బాయి
చాలా బాగుంటాడు
చూడడానికి ఆరడుగుల అందగాడు

పొద్దుతిరుగుడు పువ్వు లాంటి ముఖం
చూడగానే తల వాల్చాలనిపించే విశాలమైన ఛాతి
ఎప్పుడు చెరగని మందహాసం
మొత్తానికి ఒంగోలు గిత్తలా రంకె వేస్తుంటాడు
ఎప్పుడు చూసినా

నిలబడితే తన ఛాతి దగ్గరకు వస్తా
ఇంక కళ్ళలోకి చూడాలంటే
నా మెడని 90 డిగ్రీలు వంచాలి

వారం పాటు కష్టపడ్డా
అతని చూపు నావైపు తిప్పుకోవడానికి
నెల రోజులు పట్టింది కూర్చొని మాట్లాడుకోవడానికి

వస్తూనే అన్నాడు
నాకిలాంటివి కుదరవని
నా మనసు వింటేగా

అతను ఏం చెప్పినా ఓకే అనేదాన్ని
ఆఫీసు అవ్వగానే పరిగెత్తే దాన్ని చూడాలని
ఏం తెలియకుండానే నెలలు గడిచాయి
అందరిలానే ఆరోజు రానే వచ్చింది

తొందరగా రా ...!
ఈరోజు బయటకు వెళ్దాం అన్నాడు
ఆరు గంటలకల్లా రెక్కలు కట్టుకు వాలా ...

ఎదురుచూస్తున్నాడు
కలిసి నడక మొదలు పెట్టాం
చేయి కలపాలని చూసా
మొహమాటం వద్దంది

అలా అయిదు నిమిషాల మౌనం తర్వాత
తట్టుకోలేక అడిగేసా
ఎమన్నా చెప్తావా అని..

మళ్లీ అదే నవ్వు
ఆ నవ్వు చూస్తూనే ఇన్నాళ్ళు గడిపా
ఈసారైన కరుణిస్తాడెమో అని
కళ్ళు ఆశగా చూస్తున్నాయి
పెదాలు విచ్చుకుంటున్నాయే గాని
మాట బయటకు రానివ్వడం లేదు తను

ఎంత అయిన చౌదరి గారబ్బాయి కదా
ఆ రాజసాన్ని వదలడం లేదు
నాకు సిగ్గు ఆగడం లేదు

మనసు అతనితో కలిసి చాలా దూరం వెళ్ళింది
ఎప్పటికప్పుడు కళ్ళెం వేద్దామని ప్రయత్నించి
విఫలం అవుతూనే వున్నా...

పార్కు లో ఓ బెంచ్ దగ్గర చేరాం

నేనెప్పుడు తనకి కుడివైపున కుర్చునేదాన్ని
తనకు చెయ్యి వేసి మాట్లాడటం అలవాటు

ఏం చెప్తాడో అని
మనసు తన కళ్ళలో వెతుకుతుంది
నా తొందర తెలిసినట్టుంది

ఆ నవ్వే మళ్లీ మళ్లీ అదే నవ్వు
నేను చూస్తూ ఆగలేక పోతున్నా

కళ్ళు తనని ప్రశ్నించాయి
తన మనసుకి నా ప్రశ్న చేరింది
రెండు నిమిషాల మౌనం తర్వాత
" అవును ..." అన్నాడు మళ్లీ నవ్వాడు .

నాకు తెలియకుండా నా కళ్ళ వెంట నీల్లోచ్చాయి
ఏడుస్తూ వెళ్లి తన భుజం పై వాలిపోయాను
తన చేయి నా తలను తాకింది

ఇన్నాళ్ళు వెతికింది ఇంత తొందరగా
నన్ను చేరుతుందనుకోలేదు
అంత రౌద్రంగా ఉండేవాడు
ఇంత ప్రేమని దాచుకుంటాడనుకోలేదు

ఆనాడు మొదలైన పయనం ఇనాటికి సాగుతూనే వుంది
ఇప్పుడు నా అడుగు తన వెనక కాదు తనతో కలిసి
ఇది ఏడడుగుల రూపంగా మారాలని ఆశిస్తున్నా

ఓయ్ చౌదరి గారబ్బాయ్
ఇది నీకోసమే
ఇప్పుడైనా కళ్ళతో మాట్లాడడం మానేసి
మనసుని బయటపెట్టు
@Lakshmi

No comments:

Post a Comment