Monday, October 12, 2015

ఇజం లోని అసలు నిజం

ఇజం లోని అసలు నిజం
***************************
ఏది నిజం ఎవరు నిజం
ఏమున్నది అందులో నిజం
గడిచిపోయిన కాగితపు చదువు నాకు చెప్పలేదు ఈ నిజం
కాలిపోయే మనిషి కట్టే నాకు నేర్పలేదు ఈ నిజం
కుమిలిపోయే ఏ బ్రతుకుబండి నేర్పలేదు ఈ నిజం
కళ్ళముందు కరిగిపోతున్న కూలోడి జేవితం నేర్పలేదు ఈ నిజం.
.
నిజాన్ని వెతకడం కోసం ఇజాన్ని అనుసరిస్తే తెలుస్తుంది అసలు నిజం.
మార్పుకోసం వెతికినప్పుడు కనిపిస్తుంది ఇజం తో కూడిన అసలు నిజం
.
బంధాల బిగి కౌగిళ్ళలో బంధీ అయి బాధపడుతూ ,
భావాన్ని బలపరిచే ఇజం కోసం వెతికినపుడు
దొరుకుతుంది అసలు నిజం .
కళ్ళముందు జరిగేది విధి వైపరీత్యం కాదు ,
బలిసిన వాడి బలప్రయోగం అని తెలిసినపుడు
కనపడుతుంది అసలు నిజం
నాది అని నన్ను సముదాయించుకుంటున్నపుడు,
మరో పక్క మనసు మార్గం కోసం అన్వేషిస్తున్నపుడు
తెలుస్తుంది అసలు నిజం.
బాధతో కాదు , బలం తో కాదు ,
బ్రతుకు భయం తోనే నశిస్తుంది అని అనిపించినపుడు
అర్ధమౌతుంది అసలు నిజం
.
మనిషి తనలోని మనిషిని వెతికి
మరో మనిషికోసం బ్రతకడమే
ఇజం లోని అసలు నిజం
ఇది నేను నమ్మిన నిజం
@Lakshmi

No comments:

Post a Comment