Friday, October 30, 2015

తూరుపు తీరపు ఎరుపుకోసం వెళుతున్నా


జీవితం ఇంత సులభంగా మలుపులు తిరుగుతందని తెలిస్తే
గతుకుల దగ్గర భయపడేదాన్ని కాదు
కంకర రాళ్ళను ఏరుకుంటూ ఆగిపోయేదాన్ని కాదు
కాలం ఎదురొచ్చి నడిచిపోయే నన్ను జాలిగా చూసే అవకాశం వచ్చేది కాదు
ఇప్పటికైనా పోయింది ఏం లేదు
పాదాలకు పదును పెట్టి పంజరాన్ని పగులగొట్టి
బంధీగా పడివున్న నాలోని నన్నునేనే విడుదల చేసుకొని
మరో మలుపు కోసం తూరుపు తీరపు ఎరుపుకోసం వెళుతున్నా .
నా నిన్నటి నీడ రాత్రి చీకటిలో కలిసిపోయింది
తనదైన రూపుతో కొత్త పొద్దుతో ఎదురొస్తుంది

@Lakshmi

No comments:

Post a Comment